నిత్యం మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారు. అలానే కొందరు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అవుతున్నారు. అలాంటి వారు ఎలాగైనా తిరిగి బతికే అవకాశం లేదు కాబట్టి.. వారి అవయవాల్ని ఇతరులకు దానం చెయ్యడం ద్వారా మరెన్నో కుటుంబాలకు మేలు చేసినట్లు అవుతుంది.
ప్రతి మనిషికి కుటుంబం అనేది ఓ అందమైన ప్రపంచం. ఇందులో సభ్యులకు ఒకరిపై మరొకరి ప్రేమానుబంధాలు ఉండాయి. కుటుంబంలో ఎవరికైనా చిన్న ఇబ్బంది కలిగిన మిగిలిన వారు అల్లాడుతారు. అలాంటిది అనుకోని సంఘటనతో తమ వ్యక్తి అర్థాంతరంగా మరణిస్తే.. ఇక ఆ కుటుంబ సభ్యులు బాధ వర్ణణాతీతం. కానీ తమ మనిషి మరణించిన కూడా బ్రతికుండాలని కొందరు కోరుకుంటారు.ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు ఎంతో ఔదార్యంతో అవయవదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. మరణించిన మనిషి అవయవదానంతో […]