నిత్యం మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారు. అలానే కొందరు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అవుతున్నారు. అలాంటి వారు ఎలాగైనా తిరిగి బతికే అవకాశం లేదు కాబట్టి.. వారి అవయవాల్ని ఇతరులకు దానం చెయ్యడం ద్వారా మరెన్నో కుటుంబాలకు మేలు చేసినట్లు అవుతుంది.
నిత్యం మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారు. అలానే కొందరు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అవుతున్నారు. అలాంటి వారు ఎలాగైనా తిరిగి బతికే అవకాశం లేదు కాబట్టి.. వారి అవయవాల్ని ఇతరులకు దానం చెయ్యడం ద్వారా మరెన్నో కుటుంబాలకు మేలు చేసినట్లు అవుతుంది. అందుకే అలాంటి వారి కుటుబం సభ్యులు అవయవదానికి ముందుకు వస్తుంటారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరగ్గా .. తాజాగా మరొకటి జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడు అవయవదానం చేసి నలుగురికి పునర్జన్మ ఇచ్చాడు. గుంటూరు జిల్లా లో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామంలో ఏడుకొండలు, సుశీల దంపతులు నివాసం ఉండేవారు. వాళ్లకి శ్రీరాములు అనే కొడుకు ఉన్నాడు. అతడికి ఏడేళ్ల క్రితమే వసంత అనే అమ్మాయికి ఇచ్చి వివాహం చేసారు. ఆ తర్వాత పనుల నిమిత్తం విజయవాడ వెళ్లి.. సింగ్ నగర్ అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడు సెంట్రింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించే వాడు. రోజూ లాగానే అక్కడికి వెళ్లి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు శ్రీరాములు పైనుంచి కింద పడిపోయాడు. అతని తలకు బలంగా గాయాలయ్యాయి.
వెంటనే కుటుంబ సభ్యులు శ్రీరాములను దగ్గర్లో ఉన్న మణిపాల్ హాస్పిటల్ కి తరలించారు. దీంతో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్టు చెప్పారు. అనంతరం శ్రీరాములు భార్య, తండ్రి ఏడుకొండలు, తల్లి సుశీలకు అవయవ దానం గురించి వివరించారు. అవయవ దానం చేసి ఇతరుల ప్రాణాలు నిలబెట్టాలని వైద్యులకు చెప్పారు. దీంతో శ్రీరాములి అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. కాలేయం, కిడ్నీని అవసరమైన వారికి ఇచ్చేస్తామని డాక్టర్లు అన్నారు.
అలానే మరొక కిడ్నిని మాత్రం గుంటూరులోని వేదాంత హాస్పిటల్ కి పంపిచామని వైద్యులు తెలిపారు. వీరు అవయవదానం చేసినందుకు.. వాటిని తీసుకున్న వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ కుమారుడి అవయవాలు ఒక్కరికి కాదు ముగ్గరికి పునర్జన్మ ఇచ్చాయని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలానే తమ కుమారుడు..వారి రూపంలో ఎప్పటికి చిరంజీవిగానే ఉంటాడని శ్రీరాములి తల్లిదండ్రులు అంటున్నారు. మరి.. ఈ మంచిపని చేసి.. ఆ తల్లిదండ్రులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.