తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నిక పెట్టిన చిచ్చు ఎవ్వరూ మరిచిపోలేనిది. ఆ నిప్పుల సెగ కాస్త చల్లారిందని అనుకుంటుండగా.., ఇప్పుడు పరిశ్రమలో మరో ఎన్నికల వివాదం పుట్టుకొచ్చింది. ఈ రగడకి కేంద్రంగా నిలిచింది మాత్రం డైరెక్టర్స్ అసోసియేషన్. నవంబర్ 14న జరగనున్న తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి కె.వి.ఆర్ చౌదరి ఇద్దరు సభ్యుల నామినేషన్స్‌ను తిరస్కరించడం వివాదానికి, చర్చకు దారి తీసింది. సీనియర్ జర్నలిస్టు, దర్శకుడు ప్రభు […]