ఎయిర్‌ఇండియా విమానాలు ఇటీవల కాలంలో చిత్రమైన కారణాలతో ఆలస్యం అవుతున్నాయి. ఈ ఏడాది జులైలోనూ సౌదీ అరేబియా వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సరకు రవాణా విమానాన్ని కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం విండ్ షీల్డ్‌లో పగుళ్లు గుర్తించడమే ఇందుకు కారణం. అంతకుముందు మేలో ఢిల్లీ నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాస్‌లో గబ్బిలం ఉన్నట్లు గుర్తించారు. హాలీవుడ్ లో యాంట్స్ అనే సినిమా వచ్చింది గుర్తుంది కదా. […]