రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయింది. ఏది జరగడకూడదని ప్రపంచం మొత్తం భావించిందో.. ఇప్పుడు అదే జరుగుతోంది. ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ ప్రారంభమయిందని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇప్పటికే రష్యా సైన్యం ఉక్రెయిన్ భూభాగంలోకి దూసుకెళ్లింది. మూడు వైపుల నుంచి ఉక్రెయిన్ను చుట్టుముట్టింది. పుతిన్ ప్రకటన చేసిన కాసేపటికే ఉక్రెయిన్ రాజధాని క్యీవ్ , లోని క్రామటోర్స్క్ లో పేలుళ్ల శబ్దం వినిపించింది. రష్యా యుద్ధ విమానాలు ఈ నగరాల్లో బాంబులు వేసినట్లుగా అంతర్జాతీయ […]