పెద్దల సమక్షంలో.. వేద మంత్రాల సాక్షిగా.. మూడుముళ్లు.. ఏడడుగులు వేసి.. వివాహ బంధంతో ఒక్కటైన తోడునీడగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోతే ఆ భార్య తట్టుకోలేకపోయింది.. చావులో కూడా భర్తతో బంధాన్ని వీడలేదు. కట్టుకున్న వాడు చనిపోయాడన్న వార్త విని తట్టుకోలేని ఆమె గుండె ఆగిపోయింది. కన్నీరు పెట్టిస్తున్న ఈ విషాద సంఘటన ఒంగోలులో చోటుచేసుకుంది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బల్లికురవ మండలం చిన అంబడిపూడికి చెందిన చినపాపారావు […]
నగరంలోని ఎల్పీనగర్ పరిధి సాహెబ్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. డ్రైనేజీ క్లీనింగ్ కోసం మ్యాన్ హోల్‍లోకి దిగిన ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు గల్లంతయ్యారు. గల్లంతైన కార్మికులు అంతయ్య, శివగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టాయి. మ్యాన్‌హోల్‌లో ఊపిరాడక మృతి చెందిన ఒక కార్మికుడిని బయటకి తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అతను కూడా మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘటనపై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే […]
29 ఏళ్ల జాక్వి విలియమ్స్ ‘గ్రేవ్ మెటల్లమ్ జ్యువెలరీ’ సంస్థనే ఏర్పాటు చేసింది. చనిపోయిన వ్యక్తులు ఎప్పటికీ గుర్తిండిపోయేలా తమ వద్ద ఏదైనా వస్తువు ఉంటే బాగుంటుందని చాలామంది భావిస్తారు. అలాంటివారి కోసమే జాక్వి ఈ సంస్థను ఏర్పాటు చేసింది. కుటుంబికులు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన దంతాలు, జుట్టు లేదా బూడిద ఏది తీసుకొచ్చినా జాక్వి వాటిని అందమైన నగలుగా మార్చేస్తుంది. జాక్వీ 2017లో జ్యువెలరీ తయారీలో డిప్లమా చేసింది. ఆ తర్వాత ఆమెకు ఎక్కడా ఉద్యోగం […]