మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ.. అంతరిక్షంలోకి సైతం దూసుకెళ్తున్న రోజులు ఇవి. తాము వంట గదికే పరిమితం కాదని ప్రపంచంతోనే పోటీ పడుతూ.. ఉద్యోగాల్లోనూ మాకు తిరుగులేదని సత్తా చాటుతున్నారు. అయినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. కుటుంబ భారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకున్న ఓ యువతి వ్యవసాయం చేస్తోంది. ఈ క్రమంలో ట్రాక్టర్ నడుపుతూ వ్యవసాయం చేస్తుందని.. దీని వల్ల గ్రామానికి చెడు జరుగుతుందని నమ్మిన గ్రామస్థులు.. ఆమెను బహిష్కరించారు. […]