ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించే వార్త ఇది. వచ్చే నెల నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. నాలుగు శాతం డియర్‌నెస్ అలవెన్స్(డీఏ) పెంపుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం అధికంగా ఉండడంతో డీఏ పెంపుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం.. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం డీఏను 3 శాతం పెంచడానికి ఆమోదించింది. […]