ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు. అయితే ఆయన ఆ పదవి కోరుకోవడం లేదని తెలుస్తోంది. క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని వైవి సుబ్బారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అయితే,సీఎం జగన్ మాత్రం ఆయనను రెండోసారి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ తాజా నిర్ణయంతో వైవి సుబ్బారెడ్డి మరోసారి టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కార్పొరేషన్ […]