ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు. అయితే ఆయన ఆ పదవి కోరుకోవడం లేదని తెలుస్తోంది. క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని వైవి సుబ్బారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అయితే,సీఎం జగన్ మాత్రం ఆయనను రెండోసారి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ తాజా నిర్ణయంతో వైవి సుబ్బారెడ్డి మరోసారి టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కార్పొరేషన్ లకు సంబంధించిన చైర్మన్లను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించారు. 11 మంది చైర్మన్ అదేవిధంగా మరికొంతమందికి డైరెక్టర్ పదవులను ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గా దాడి రత్నాకర్ ను నియమిస్తూ నిర్ణయం వెల్లడించారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారతే లక్ష్యంగా సంక్షేమం అభివృద్ధి పరంగా నిర్ణయాలు తీసుకున్నామని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. 55 శాతం మంది మహిళలకు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో అవకాశం కల్పించామని సజ్జల రామకృష్ణా రెడ్డి వివరించారు.
ఏపీలో నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జాబితాను ప్రకటించారు. నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 55 శాతం ప్రకటించడం గమనార్హం. డీసీఎం చైర్ పర్సన్ గా పల్లా చిన్న తల్లిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు కోర్పారేషన్ చైర్మన్ పదవుల్లో భారీగా కేటాయింపులు జరిపారు.