కర్ణాటకలో రాజకీయ విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఎగిసిపడుతున్నాయి. ముఖ్యమంత్రి యడ్డ్యూరప్పకు సొంత పార్టీ నేతల వ్యవహారం పెద్ద తల నొప్పిగా మారినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి సీఎం యడ్డ్యూరప్పను తొలగించాలని తెర వెనకాల పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలల నుంచి సీఎం రాజీనామా చేస్తున్నారంటూ వార్తలు కోడై కూస్తున్నాయి. ఏకంగా జాతీయ మీడియాలో సైతం యడ్డీ రాజీనామాపై వరుస కథనాలు వెలువడుతుండటం చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం యడ్డ్యూరప్ప నెలకొసారి […]