పంజాబ్ లో మరో రెండు వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. ఇసుక అక్రమ మైనింగ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అధికారులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నేడు ఆయనను కోర్టులో హాజరుపర్చే అవకాశముంది. భూపిందర్ సింగ్ హనీ స్వయానా చన్నీ మేనల్లుడు. ఈయన పంజాబ్ […]
గత కొంత కాలంగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఇక ప్రతి పక్ష నేతలు ఇది ముమ్మాటికి రైతు విజయం అని కొనియాడుతున్నారు. జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ.. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నాం. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనిపై ప్రకటన చేసి… రాజ్యంగపరమైన ప్రక్రియను ప్రారంభిస్తాం. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన […]