ఫిల్మ్ డెస్క్- మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆచార్య కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా నేపధ్యంలో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం పరస్థితులు మామూలు దశకు చేరుకోవడంతో షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన టీజర్, […]