బజారుకో, పనిమీదో, ఆఫీస్‌కో ఎక్కడికి వెళ్తున్నా… ఇంట్లో పిల్లలు మేమూ వస్తామంటూ మారం చేస్తారు. ఒక్కోసారి ఒక్కరినే విదిలి వెళ్లలేక తల్లిదండ్రులు కూడా వారిని తీసుకెళ్తుంటారు. మరి, అలా వచ్చిన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అన్ని సందర్భాల్లో మనం జాగ్రత్తగా ఉంటామని చెప్పలేం. ఒక్కోసారి పొరపాటుగానో, యథాలాపంగానో మనం చేసే పని చెరుపుకోలేని తప్పుకు కారణం కావచ్చు. అసలు విషయమేంటంటే పిల్లల్ని బయటకు తీసుకెళ్లినప్పుడు ఇప్పుడే వచ్చేస్తాం కదా కారులోనే ఆడుకో అని వదిలేసి వెళ్తుంటారు. […]