జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో 2020లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు వాయిదాపడి ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.14 క్రీడా విభాగాలకు మొత్తం 102 మంది భారతీయ అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్ కోసం అర్హత సాధించారు. టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతక విజేతలకు రూ.3కోట్ల బహుమతి ఇవ్వాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టోక్య ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి ఢిల్లీకి చెందిన నలుగురు అథ్లెట్లు ఎంపికయ్యారు. […]
జగతికి ప్రత్యక్ష దైవం సూర్యుడు. సృష్టికారకుడైన సవితగానూ, స్థితికారకుడైన మిత్రునిగానూ, మృత్యుకారకుడైన మార్తాండునిగానూ ఈ విశ్వంలో ఆయన వెలుగొందుతున్నాడు. మన దేశంలో సూర్యుణ్ణి వేదకాలం నుంచి ఆరాధిస్తున్నారు. సూర్యారాధనతో సమస్త పాపాలూ నశిస్తాయనీ, ఆరోగ్యం చేకూరుతుందనీ అనాదిగా వస్తున్న విశ్వాసం. రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు సూర్యుణ్ణి ఆరాధించి, అగస్త్య మహర్షి నుంచి పొందిన ‘ఆదిత్య హృదయా’న్ని స్తోత్రం చేసి, రావణుణ్ణి సంహరించాడు. హనుమంతుడు సూర్యుణ్ణి ఆరాధించి నవ వ్యాకరణవేత్త అయ్యాడు. మహాభారతంలో ధర్మరాజు కూడా సూర్యారాధనతో అక్షయపాత్రను […]