ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే తెలియని భారతీయులు ఉండరు. ఆ మహావీరుని కథ చదివితే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒంట్లో భయం పోయి ధైర్యం వస్తుంది. ఒంటి చేత్తో విదేశీ రక్కసి మూకలను తరిమికొట్టి.. మరాఠా సామ్రాజ్య చక్రవర్తిగా, యోధుడిగా చరిత్రలో నిలిచిపోయిన మహారాజు ఛత్రపతి శివాజీ. అలాంటి వీరుడి జీవిత కథని సినిమాగా తెరకెక్కించడం అంటే గొప్ప విషయంగా పరిగణించాలి. చరిత్రని అప్పుడప్పుడు ఇలా సినిమాల ద్వారా గుర్తు చేసుకోవాలి. పుస్తకాల్లో చదివిన దాని కంటే సినిమాలో […]