ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే తెలియని భారతీయులు ఉండరు. ఆ మహావీరుని కథ చదివితే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒంట్లో భయం పోయి ధైర్యం వస్తుంది. ఒంటి చేత్తో విదేశీ రక్కసి మూకలను తరిమికొట్టి.. మరాఠా సామ్రాజ్య చక్రవర్తిగా, యోధుడిగా చరిత్రలో నిలిచిపోయిన మహారాజు ఛత్రపతి శివాజీ. అలాంటి వీరుడి జీవిత కథని సినిమాగా తెరకెక్కించడం అంటే గొప్ప విషయంగా పరిగణించాలి. చరిత్రని అప్పుడప్పుడు ఇలా సినిమాల ద్వారా గుర్తు చేసుకోవాలి. పుస్తకాల్లో చదివిన దాని కంటే సినిమాలో ఆ దృశ్యాలు కళ్ళ ముందు మెదులుతుంటే ఆ అనుభూతే వేరు. అందుకే రాజుల కథలు, చరిత్రలు గొప్పగా ఉంటాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా మరాఠీలో ‘వేడాట్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ అనే సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో ఛత్రపతి శివాజీ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. “ఫస్ట్ లుక్ పోస్టర్ ను షేర్ చేస్తూ.. ‘వేడాట్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ చిత్రం షూటింగ్ ప్రారంభించాము. ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన జీవితం నుంచి స్ఫూర్తిని నాలో నింపుకుని, జిజియాబాయి ఆశీస్సులతో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తాను. నన్ను ఆశీర్వదించండి” అంటూ అక్షయ్ కుమార్ పోస్ట్ చేశారు. అదే ఇప్పుడు అక్షయ్ కుమార్ కి తలనొప్పి తెచ్చిపెట్టింది. అక్షయ్ కుమార్ శివాజీ పాత్రలో సినిమా చేస్తున్నారని తెలిసిన నెటిజన్లు.. ఆ సినిమా చేయవద్దంటూ ట్రోల్ చేస్తున్నారు.
आज मराठी फ़िल्म ‘वेडात मराठे वीर दौड़ले सात’ की शूटिंग शुरू कर रहा हूँ जिसमें छत्रपति शिवाजी महाराज जी की भूमिका कर पाना मेरे लिये सौभाग्य है।मैं उनके जीवन से प्रेरणा लेकर और माँ जिजाऊ के आशीर्वाद से मेरा पूरा प्रयास करुंगा !
आशीर्वाद बनाए रखियेगा। pic.twitter.com/MC50jCdN8Z— Akshay Kumar (@akshaykumar) December 6, 2022
దయచేసి మహావీరుడి చరిత్రని నాశనం చేయవద్దు అంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. చౌకబారు మేకప్ తో ఛత్రపతి శివాజీ మహారాజ్ ని అవమానిస్తున్నారని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అక్షయ్ కుమార్ నెత్తి మీద కొన్ని లైట్లు వెలుగుతున్నాయి. అయితే దాన్ని తప్పుబడుతూ.. ఛత్రపతి శివాజీ ఉన్న సమయంలో విద్యుత్ సదుపాయం లేదని, కెనడాలో సైతం బల్బు లేదని విమర్శిస్తున్నారు. ఇలాంటి గొప్ప వీరుల పాత్ర పోషిస్తున్నప్పుడు.. మనసు, ఆత్మ ప్రాజెక్ట్ పై లగ్నం చేయాలని సూచిస్తున్నారు. రోజువారీ షిఫ్ట్ వేతనాలు తీసుకుని చేసే వైఖరి ఈ సినిమాకి పనిచేయదని కామెంట్స్ చేస్తున్నారు.
సామ్రాట్ పృథ్వీ రాజ్ చిత్రంలో పృథ్వీరాజ్ చౌహన్ పాత్రని చెడగొట్టారని, ఇప్పుడు మరొక చారిత్రక పాత్రను చెడగొడతారా అంటూ మరి కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా కథ బాగున్నప్పటికీ.. ఆ సినిమాలో పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రకి అక్షయ్ కుమార్ సూట్ కాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ పాత్రని అక్షయ్ కుమార్ సీరియస్ గా తీసుకోలేదని, ఆ పాత్రకి తగ్గట్టు అక్షయ్ కుమార్ తన శరీరాకృతిని మార్చుకోలేదని, అందుకే సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి మహావీరుడి ఛత్రపతి శివాజీ పాత్రని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని అక్షయ్ కుమార్ ని సినిమా చేయవద్దంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ సినిమా విషయంలో అయినా అక్షయ్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని.. శివాజీ పాత్రని సీరియస్ గా తీసుకుంటారో లేదో చూడాలి.
एक तो सस्ता मेकअप करके हमारे छत्रपति महाराज का अपमान कर रहे हो। ऊपर से बल्ब जला रखे हैं। उस दौर में तो कनाडा में भी बिजली और बल्ब नहीं था।
जब इतने बड़े किरदार पर काम करते हो तो प्रोजेक्ट में दिल और जान लगानी पड़ती है, डेली शिफ्ट की दिहाड़ी वाला एटीट्यूड नहीं चलता। https://t.co/7XgdrK6ncc pic.twitter.com/6uX2BGzHnI
— Rofl Gandhi 2.0 🏹 (@RoflGandhi_) December 6, 2022
Aapse Samrat Prithviraj naa hopaya
Every indian ki mind and heart mein already ek chavi Chatrapati Shivaji Maharaj ji ki clear hai us level pe aap aur apki 30 days ki schedule mein hopayega kya
Aapke irade bure nahi hai sir lekin end product bura aaya toh bohot issues honge pic.twitter.com/mxpaDbPUXD— Rahul (@RahulKattela) December 6, 2022