ఇటీవల చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా థియేట్రికల్ రిలీజ్ తర్వాత తక్కువ టైంలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. సినిమాలు ఓటిటిలోకి వచ్చాక ఆదరించేవారి సంఖ్య రోజురోజుకూ పెడుతోంది. ఈ క్రమంలో థియేటర్స్ లో చిన్న సినిమాగా రిలీజై.. పెద్ద విజయాన్ని అందుకున్న 'రైటర్ పద్మభూషణ్' మొత్తానికి ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.
తెలుగులో ఎప్పుడు ఎంటర్ టైన్ మెంట్ సినిమాలే కాదు అప్పుడప్పుడు ఆలోచన రేకెత్తించే మంచి మంచి ఫ్యామిలీ మూవీస్ కూడా వస్తుంటాయి. అలా రీసెంట్ గా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరిస్తున్న చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన సుహాస్.. ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ పాత్ర ఈ పాత్ర అనేం డిఫరెన్స్ లేకుండా అన్ని రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అలా సుహాస్ ప్రధాన పాత్రలో […]