తెలుగులో ఎప్పుడు ఎంటర్ టైన్ మెంట్ సినిమాలే కాదు అప్పుడప్పుడు ఆలోచన రేకెత్తించే మంచి మంచి ఫ్యామిలీ మూవీస్ కూడా వస్తుంటాయి. అలా రీసెంట్ గా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరిస్తున్న చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన సుహాస్.. ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ పాత్ర ఈ పాత్ర అనేం డిఫరెన్స్ లేకుండా అన్ని రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అలా సుహాస్ ప్రధాన పాత్రలో రీసెంట్ గా వచ్చిన మూవీనే ‘రైటర్ పద్మభూషణ్’.
ఇక వివరాల్లోకి వెళ్తే.. షార్ట్ ఫిల్మ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న వాళ్లందరూ కలిసి చేసిన ప్రయత్నం ఈ సినిమా. చాలా తక్కువ బడ్జెట్ తో తీసినప్పటికీ ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ మూవీ చూసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా టీమ్ మొత్తాన్ని మెచ్చుకున్నారు. ఆయా ఫొటోల్ని హీరో సుహాస్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసి తెగ ఆనందపడిపోయాడు. మీలో ఎవరైనా సరే సినిమా చూసుంటే ఓకే. లేదంటే ఇప్పుడు మీలో గానీ లేదంటే మీకు తెలిసిన లేడీస్ కు చెప్పండి. వాళ్లకోసం ప్రత్యేకంగా ఫ్రీ షోలు వేస్తున్నారని.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ అందరినీ ఆకట్టుకుంటున్న రేపు అంటే ఫిబ్రవరి 8న కేవలం ఆడవాళ్ల కోసం ‘రైటర్ పద్మభూషణ్’ ఫ్రీ షోలు వేయనున్నారు. అందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 38 థియేటర్లని ఎంపిక చేశారు. ఇక ఎక్కడెక్కడ ఉచితంగా సినిమా షోలు వేస్తారనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా నిర్మాతలు షేర్ చేశారు. ఇది తెలిసి చాలామంది అమ్మాయిలు, మహిళలు.. సినిమా చూసేందుకు రెడీ అయిపోతున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ సినిమా చూసుంటే.. ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి.
#WriterPadmabhushan Women’s Wednesday ❤️
Women – Go watch #WriterPadmabhushan tomorrow like a QUEEN.
Men – Take all the women who make your life beautiful to the film tomorrow. @ActorSuhas @TinaShilparaj @gouripriyareddy @prasanthshanmuk @LahariFilm pic.twitter.com/ONVoQFb8ka
— Chai Bisket Films (@ChaiBisketFilms) February 7, 2023