బిజినెస్ డెస్క్- కరోనా లాంటి క్లిష్ట సమయంలో చాలా మంది ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సోకిన కుటుంబాలు ఆస్పత్రుల బిల్లులు కట్టలేక అప్పులపాలవుతున్నారు. అందుకే ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి ముందస్తుగానే ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి. కుటుంబంలో అనుకోని ఆపద వచ్చినప్పుడు ఆర్ధికంగా అండగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోకుండా వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం కూడా అనేక పధకాలను ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యమైంది ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన. ప్రమాదవశాత్తు మరణించినా, అంగ వైకల్యం […]