మీరు నిరుద్యోగులా..? బ్యాంకు కొలువు చేయాలన్నదే మీ కోరికా..? అయితే అలాంటి సువర్ణవకాశం మీ ముందుకొచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5,000 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన బ్యాంకింగ్ ఇండస్ట్రీలో స్థిరపడాలనుకునే వారికి మంచి అవకాశం అని చెప్పుకోవాలి.