మీరు నిరుద్యోగులా..? బ్యాంకు కొలువు చేయాలన్నదే మీ కోరికా..? అయితే అలాంటి సువర్ణవకాశం మీ ముందుకొచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5,000 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన బ్యాంకింగ్ ఇండస్ట్రీలో స్థిరపడాలనుకునే వారికి మంచి అవకాశం అని చెప్పుకోవాలి.
బ్యాంకింగ్ ఇండస్ట్రీలో స్థిరపడాలనుకునేవారికి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 5,000 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణ పరిధిలో 106 ఖాళీలుండగా, ఏపీ వ్యాప్తంగా 141 ఖాళీలున్నాయి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదేని విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
మొత్తం ఖాళీలు: 5,000
కేటగిరీ వారీగా ఖాళీలు:
విభాగాలు: అప్రెంటిస్.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదేని విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 2023, మార్చి 31 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. (బీసీలకు మూడేళ్లు, ఎస్‌సీ.. ఎస్‌టీలకు అయిదేళ్లు, , దివ్యాంగులకు పదేళ్ల వయసు సడలింపు ఉంటుంది).
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
స్టైపెండ్: నెలకు రూ.10000(రూరల్), రూ.12000(అర్బన్), రూ.15000(మెట్రో).
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
రాత పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్.
దరఖాస్తు ఫీజు: రూ.800(ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.600; దివ్యాంగులకు రూ.400).
దరఖాస్తు చేయు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 20.03.2023
దరఖాస్తులకు చివరి తేదీ: 03.04.2023
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 2వ వారం, 2023