వాళ్లంతా పసుపు-కుంకుమలకు దూరమైన వితంతువులు. తెల్ల చీర కట్టుకుని, జీవితంలో రంగులు లేకుండా బతుకుతుంటారు. అలాంటి వాళ్ల జీవితాల్లో రంగులు నింపింది హోలీ. వసంతాలు వెలిసిపోయిన వారి జీవితాల్లో మళ్లీ రంగులు పూయించింది. మోడు వారిన వింతువుల జీవితాల్లో వసంత కేళి ఆనందోత్సాహాలు నింపింది. దాదాపు వెయ్యి మంది వితంతువులు హోలీ ఆడుతూ మళ్లీ రంగుల లోకంలో విహరించారు. ఎక్కడ, ఏంటి? అనుకుంటున్నారా? మరి.. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.. ఉత్తరప్రదేశ్ లోని మధురలో ఈ అపూర్వ […]