బెంగళూరు- కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతితో కన్నడ నాట విషాదం అలముకుంది. ఒక్క శాండల్ వుడ్ లో మాత్రమే కాదు, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించేందుకు సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు బారులు తీరారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం కన్నీటి సంద్రమైంది. శాండల్ వుడ్ ప్రముఖుల నుంచి మొదలు అన్ని బాషల సినీ ప్రముఖులు కంఠీరవ స్టేడియానికి వచ్చి పునీత్ రాజ్ కుమార్ […]