రక్తదానం చేయడం అంటే.. ప్రాణదానం చేయడమే. రక్తదానంలోనే దానం అనే మాట ఉంది. సో.., ఎక్కడ బ్లడ్ బ్యాంక్ కేంద్రాలు ఉన్నా.., దీనిని వ్యాపారంగా చూడకూడదు. నిజానికి ఇలాంటి రక్తదాన కేంద్రాలు నడవాలంటే మానత్వాన్ని చాటుకునే రక్తదాతలు ఉంటేనే సాధ్యం అవుతుంది. ఇందుకే రక్తదానం చేసే ప్రాణదాతలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. బ్లడ్ డొనేషన్ విషయంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి, వారిలో అవగాహన పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. […]