ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా కష్టాలు మొదలయ్యాయి. కేసుల సంఖ్య పెరగడంతో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమాలు వాయిదా వేసుకున్నాయి. నాగార్జున, నాగచైతన్యలు హీరోలుగా కల్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన చిత్రం ‘బంగార్రాజు’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. కరోనాను సైతం తట్టుకొని ఈ సినిమా బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ. 50 కోట్లను రాబట్టి రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతోందీ […]