మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 15వ సీజన్ కోసం బీసీసీఐ కఠినమైన బయో బబుల్ నిబంధనలను సిద్ధం చేసింది. కోవిడ్ నేపథ్యంలో గతేడాది అనుభవాల దృష్ట్యా ఈసారి రూల్స్‌ను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. గతేడాది భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ కరోనా కేసుల కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు వరుణ్ చక్రవర్తి తొలుత పాజిటివ్ గా తేలగా.. ఆ తర్వాత కేసులు ఒక్కోక్కటిగా బయటపడడంతో లీగ్ ను మధ్యలోనే ఆపేసి.. […]