పట్నా- ఢిల్లీ మధ్య తిరిగే తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ వ్యక్తి బన్నీ, అండర్‌వేర్‌తో తీరిగుతూ కనిపించాడు. ఆ బోగీలో ఉన్న మహిళలు, మిగిలిన ప్రయాణికులు అభ్యంతరం చెప్పారు. దానికి ప్రతిగా తాను చేసిన తప్పును గ్రహించకపోగా.. తిరిగి వారినే తిట్టడం మొదలెట్టాడు. అలా చేసింది ఏ మతిస్థిమితం లేనివాడో, చిన్నపిల్లాడో కాదు.. బిహార్ అధికార పార్టీ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్. ఎమ్మెల్యే గోపాల్ మండల్ అలా తిరగడంపై బోగీలోని తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. […]