ఒంటిరి మహిళ అనగానే అక్కడున్న కామాంధులకు ఉత్సాహం వచ్చింది. ఆమెను వేధించడం మొదలు పెట్టారు. భర్త ఐదేళ్ల క్రితం చనిపోయాడు. ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటూ ఆ మహిళ జీవనం సాగిస్తోంది. బతుకుతెరువు కోసం ఆ ఊరు వలస వచ్చింది. ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఆ గ్రామస్థులు కొందరు లైంగికంగా వేధింపులు మొదలు పెట్టారు. పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏం చేయాలో తెలియని ఆ మహిళ కలెక్టరేట్ ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. […]