ఒంటిరి మహిళ అనగానే అక్కడున్న కామాంధులకు ఉత్సాహం వచ్చింది. ఆమెను వేధించడం మొదలు పెట్టారు. భర్త ఐదేళ్ల క్రితం చనిపోయాడు. ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటూ ఆ మహిళ జీవనం సాగిస్తోంది. బతుకుతెరువు కోసం ఆ ఊరు వలస వచ్చింది. ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఆ గ్రామస్థులు కొందరు లైంగికంగా వేధింపులు మొదలు పెట్టారు. పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏం చేయాలో తెలియని ఆ మహిళ కలెక్టరేట్ ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని బరేలికి చెందిన రస్మితా రౌత్ భర్త ప్రేమ్ నాథ్ ఐదేళ్ల క్రితం మృతి చెందాడు. కుటుంబ పోషణ రస్మితపై పడింది. బతుకుతెరువు కోసం ఇద్దరు పిల్లలను తీసుకుని ఒడిశా రాష్ట్రం కొలిపంగి గ్రామానికి వెళ్లింది. స్థానిక గ్రామస్థులు కొందరు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. జనవరి 24న ఆమె భాపూర్ పోలీసు అవుట్ పోస్టులో ఫిర్యాదు చేసింది. అయినా ఎవరూ స్పందించలేదని ఆరోపించింది.
అభద్రతా భావానికి గురైన మహిళ తనకు న్యాయం చేయాలంటూ డెంఖనాల్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు అడ్డుకోవడంతో.. గాజు ముక్కతో గొంతు కోసుకోవాలని ప్రయత్నించింది. పోలీసులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: మరిదిపై కన్నేసిన వదిన.. పడక సుఖం కోసం పగ పట్టి..!