తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు తీస్తున్నారు. సైరా నరసింహారెడ్డి తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’చిత్రంలో నటిస్తున్నారు. కరోనా ప్రభావంతో ఈ చిత్రం షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. ఈ చిత్రంలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న భోళా శంకర్ చిత్రం క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్ టెయిన్ మెంట్స్ బ్యానర్స్ లో రూపు దిద్దుకుంటోంది. […]