తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు తీస్తున్నారు. సైరా నరసింహారెడ్డి తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’చిత్రంలో నటిస్తున్నారు. కరోనా ప్రభావంతో ఈ చిత్రం షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. ఈ చిత్రంలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న భోళా శంకర్ చిత్రం క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్ టెయిన్ మెంట్స్ బ్యానర్స్ లో రూపు దిద్దుకుంటోంది. మహా శివ రాత్రి సందర్భంగా ‘భోళా శంకర్’ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
వైబ్ ఆఫ్ భోళా అంటూ.. ట్విటర్ అకౌంట్ లో మెగాస్టార్ వీడియో షేర్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు మహాశివరాత్రి గిఫ్ట్ ఇచ్చారు. రామ బ్రహ్మం సుంకర నిర్మాత. ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర ఈ చిత్రాన్నినిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. తమన్నా హీరోయిన్ పాత్ర లో నటిస్తుంది. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది. ఏ కే ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మాణం. మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్‌లో ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
Celebrate this MahaShivarathri with the #VIBEofBHOLAA ⚡
Here’s MEGA🌟@KChiruTweets as #BholaaShankar 🔱
▶️ https://t.co/W5HLUeXVFL#BholaaShankarFirstLook@MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @AKentsOfficial @BholaaShankar #MegaEuphoria ✨ pic.twitter.com/MOxvhmYcqf
— Megastar Chiranjeevi™ (@Chiru_FC) March 1, 2022