గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ సింగర్.. గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూసిన విషాదం నుంచి కోలుకోక ముందు ప్రముఖ నటుడు కన్నుమూయడంతో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఒకప్పుడు బుల్లితెరపై సెన్సేషన్ సృష్టించిన మహాభారతం సీరియల్ లో భీముని పాత్రలో కనిపించిన ప్రవీణ్ కుమార్ సోబ్తీ గుండెపోటుతో తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. ప్రవీణ్ కుమార్తె నికునిక ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నిన్న రాత్రి 9.30 […]