మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోరుమీదున్న ఒన్ ఆఫ్ ది సీనియర్ హీరో. తాజాగా వాల్తేరు వీరయ్య తో సూపర్ హిట్ కొట్టారు మెగాస్టార్. అయితే తర్వాత ఏ సినిమాని ఒప్పుకోలేదు చిరంజీవి. దానికి ప్రధాన కారణం మెగాస్టార్ కు తగ్గ కథలు దొరక్కపోవడమే.
గత కొంతకాలం నుంచి సినిమాలు చూడటంలో ప్రేక్షకుల ధోరణి మారింది. పలానా హీరో, పలానా హీరోయిన్, డైరెక్టర్ అని సినిమాలు చూసే ప్రేక్షకులు తగ్గిపోయారు. ప్రస్తుతం వారు సినిమా కథ ఎలాఉంది బాగుందా? లేదా? అన్న విషయాన్ని మాత్రమే చూస్తున్నారు. ఇక హీరోలు కూడా మంచి కథలకే ప్రియారిటీ ఇస్తున్నారు. కథ మంచిది అయితే ఆ సినిమా సగం విజయం సాధించినట్లే. ఇక కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే ధోరణిని పూర్తిగా మర్చారు. మరి ఇలాంటి […]