హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (హెచ్‌సీయూ) ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్ధి సంఘాల మధ్య హైడ్రామా చోటు చేసుకుంది. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు యూనివర్సిటీ క్యాంపస్ లో బీబీసీ ప్రసారం చేసిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్ లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. వందమంది పోలీసుల మధ్య డాక్యుమెంటరీని ప్రదర్శించారు. యూనివర్సిటీ యాజమాన్యం స్క్రీనింగ్ నిలిపివేయాలని ఎస్ఎఫ్ఐకి మెయిల్ చేసింది. అయినా గానీ ఎస్ఎఫ్ఐ పట్టుబట్టి మరీ ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించింది. […]