బంజారాహిల్స్ స్కూల్‌లో చిన్నారిపై అత్యాచారం ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే పోలీసులు నిందితుడు రజనీ కుమార్‌ను అరెస్ట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం స్కూలు ప్రిన్సిపల్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, బాలిక తల్లిదండ్రులతో పాటు మరికొంత మంది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కూతురులాంటి పరిస్థితి ఏ బిడ్డకు రాకూడదని పాప తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కాగా, […]