బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ క్రీడా స్ఫూర్తి చాటి క్రికెట్ అభిమానుల ప్రశంసలు పొందుతున్నాడు. ఆఫ్ఘానిస్థాన్‌తో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా.. శుక్రవారం రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ ఆటగాడు నజిబ్ ఉల్లా.. షకీబ్ బౌలింగ్‌లో స్ట్రెట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతిని షకీబ్ ఆపేందుకు ప్రయత్నిచగా.. బంతి అతని చేతుల నుంచి వెళ్లి స్టంప్స్‌కు తాకింది. కానీ.., అప్పటికే నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న రహెమాన్ […]