బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ క్రీడా స్ఫూర్తి చాటి క్రికెట్ అభిమానుల ప్రశంసలు పొందుతున్నాడు. ఆఫ్ఘానిస్థాన్‌తో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా.. శుక్రవారం రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ ఆటగాడు నజిబ్ ఉల్లా.. షకీబ్ బౌలింగ్‌లో స్ట్రెట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతిని షకీబ్ ఆపేందుకు ప్రయత్నిచగా.. బంతి అతని చేతుల నుంచి వెళ్లి స్టంప్స్‌కు తాకింది. కానీ.., అప్పటికే నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న రహెమాన్ షా క్రీజ్ నుంచి బయటికి రావడంతో.. బంగ్లా ఆటగాళ్లు, బౌలర్ షకీబ్ రనౌట్ కి అప్పీల్ చేశారు. దీంతో ఫీల్డ్ అంపైర్.. థర్ఢ్ అంపైర్‌కు రిఫర్ చేయగా.. రీప్లేలో రహెమాన్ క్రీజ్ బయటికి వచ్చినట్లు స్పష్టం అవుతుంది. ఇక థర్డ్ అంపైర్ కూడా రహెమాన్ అవుట్ అయినట్లు ప్రకటించాడు. ఇక చేసేది లేక తాను నిజంగానే ఔట్ అనుకుని రహెమాన్ పెవిలియన్ బాట పట్టాడు. కానీ.., ఇక్కడ నుండే అసలు కథ మొదలైంది.
అప్పటి వరకు కామ్ గా ఉన్న షకీబ్.. అసలు బంతికి తన చేతికి తగలలేదని లేట్ గా రియలైజ్ అయ్యాడు. వెంటనే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌తో చర్చించి.. తమ అప్పీల్‌ను వెనక్కు తీసుకుంటున్నట్లు అంపైర్‌కు తెలియజేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ మరో మారు క్షుణ్ణంగా పరిశీలించాలని థర్డ్ అంపైర్‌ను కోరడంతో షాకింగ్ ట్విస్ట్ బయట పడింది.
ఈ సారి బంతి షకీబ్ చేతులకు తగులుతున్న దగ్గర నుంచి వీడియోను రీప్లే చేసి చూడగా.. బంతి షకీబ్ చేతికి తగల్లేదని స్పష్టమైంది. దీంతో థర్డ్ అంపైర్ రహెమాన్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. ఫీల్డ్ అంపైర్, థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చినా కూడా.. తన చేతులకు బంతి తగల్లేదని నిజాయితీగా ఒప్పుకున్న షకీబ్‌పై ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shakib Al Hasan didn’t touch the ball, but 3rd umpire reckoned he did and gave Rahmat Shah out. Tamim Iqbal and Shakib discussed about it and later called back Rahmat Shah to play again. pic.twitter.com/01pRlxTGJI
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2022