పాతికేళ్లుగా వినోదరంగంలో గుర్తింపు తెచ్చుకున్న ఈటీవీ నెట్ వర్క్ ఇప్పుడు చిన్నారుల కోసం రంగుల హరివిల్లును తీసుకువచ్చింది. ‘బాలభారత్’ పేరుతో దేశవ్యాప్తంగా 11 భాషల్లో.. 12 ఛానళ్లను చిన్నారుల కోసం అందిస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఈ 12 ఛానళ్లను ఒకేసారి ప్రారంభించారు రామోజీ సంస్థల అధినేత రామోజీరావు. తెలుగుతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడియా, పంజాబీ, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో బాలభారత్ ప్రసారమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల మనుసులను […]