రైల్వే స్టేషన్‌లో ప్రమాదవశాత్తు రైలు కింద పడబోయిన ఓ మహిళను ఓ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ రక్షించాడు. రైలు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె రైలు చక్రాల కింద పడబోగా… అప్రమత్తంగా వ్యవహరించిన కానిస్టేబుల్ ఒక్క ఉదుటున ఆమెను ప్లాట్‌ఫాం మీదకు లాగేశాడు. దీంతో ఆ మహిళ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లయ్యింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని పురులియా రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైలు కదులుతోన్న సమయంలో ఓ మహిళ […]