హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ మరోసారి తన సత్తా చాటాడు. పవర్‌ప్లేలో వికెట్ తీసే తన అలవాటును కొనసాగించి.. టీమిండియాకు శుభారంభం అందించాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టిన సిరాజ్.. కోల్‌కత్తా వేదికగా జరగుతున్న రెండో వన్డేలోనూ ఒక అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో తొలి వికెట్ పడగొట్టాడు. సిరాజ్ వేసిన ఆ బాల్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ఆ బాల్‌ను ఆడేందుకు లంక బ్యాటర్ అవిష్క ఫెర్నాండో దగ్గర సమాధానమే […]