హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ మరోసారి తన సత్తా చాటాడు. పవర్‌ప్లేలో వికెట్ తీసే తన అలవాటును కొనసాగించి.. టీమిండియాకు శుభారంభం అందించాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టిన సిరాజ్.. కోల్‌కత్తా వేదికగా జరగుతున్న రెండో వన్డేలోనూ ఒక అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో తొలి వికెట్ పడగొట్టాడు. సిరాజ్ వేసిన ఆ బాల్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ఆ బాల్‌ను ఆడేందుకు లంక బ్యాటర్ అవిష్క ఫెర్నాండో దగ్గర సమాధానమే లేకపోయింది. బౌల్డ్ అయిన తర్వాత.. అసలేం జరిగింది అన్నట్లు అలానే ఉండిపోయాడు ఫెర్నాండో. చేసేదేం లేక తెల్లముఖం వేసుకుని.. పెవిలియన్ బాటపట్టాడు. సిరాజ్ ఇన్నింగ్స్ ఉత్సాహంతో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ సైతం చెలరేగిపోయారు.
అవిష్క ఫెర్నాండో 20 పరుగులు చేసి అవుటైన తర్వాత.. మరో ఓపెనర్ ఎన్. ఫెర్నాండో, వన్‌డౌన్‌లో వచ్చిన మెండిస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 29 వికెట్ల వద్ద తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక.. మరో వికెట్ పడకుండా 100 పరుగుల మార్క్ దాటింది. కానీ.. 102 పరుగుల వద్ద.. మెండిస్‌ను కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో పెవిలియన్ చేర్చాడు. ఇక్కడి నుంచి శ్రీలంక వెంటవెంటనే వికెట్లు కోల్పోయి. 2 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉన్న లంక.. కొన్ని ఓవర్లలోనే 152 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇక తన రెండో స్పెల్ వేసేందుకు వచ్చిన సిరాజ్ లంక ఇన్నింగ్స్‌ను ముగించాడు.
ఇన్నింగ్స్ 40వ ఓవర్ వేసిన సిరాజ్.. రెండో బంతికి దునిత్ వెల్లలాగే, నాలుగో బంతికి లాహిరు కుమార్‌ను అవుట్ చేయడంతో లంక ఆలౌట్ అయింది. 39.4 ఓవర్లలో 215 పరుగులకు శ్రీలంకను ఆలౌట్ చేశారు భారత బౌలర్లు. ఇందులో సిరాజ్ 3, కుల్దీప్ యాదవ్ 3, ఉమ్రాన్ మాలిక్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నారు. ఎన్. ఫెర్నాండోను శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో రనౌట్ చేశాడు. మరి ఈ నామమాత్రపు టార్గెట్‌ను టీమిండియా బ్యాటర్లు ఎంత త్వరగా ఛేదిస్తారో చూడాలి. మరి ఈ మ్యాచ్‌లో సిరాజ్ తీసిన ఫస్ట్ వికెట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Timber Strike, the @mdsirajofficial way 👌👌
Relive how he dismissed Avishka Fernando 🔽
Follow the match 👉 https://t.co/MY3Wc5253b#TeamIndia | #INDvSL pic.twitter.com/ZmujAITsco
— BCCI (@BCCI) January 12, 2023