క్లినికల్ ట్రయల్స్ తర్వాత కోవిడ్-19 లక్షణాలను 15 నుంచి 11 రోజులకు రెమ్‌డెసివిర్ తగ్గించగలదన్న గుర్తింపు రావడంతో ఆ ఔషధానికి డిమాండ్ పెరిగింది. కానీ అది దివ్యౌషధమేమీ కాదని నిపుణులు హెచ్చరించారు. దీంతో కరోనా అత్యవసర చికిత్సలో వాడే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిని రాష్ట్రాలకు సరఫరా చేయరాదని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రస్తుతం దేశంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు చాలినన్ని నిల్వ ఉన్నాయన్నారు. […]