గురుర్బహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః అంటూ గురువుకు ఎంతో ఉన్నతమైన స్థానం కల్పించబడింది. తల్లిదండ్రుల తర్వాత పిల్లల బాధ్యత గురువుపైనే ఉంటుంది. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దే గొప్ప బాధ్యత గురువుపైనే ఉంటుంది. పుట్టినప్పటి నుంచి జీవితంలో మంచి స్థానం పొందేవరకు ప్రతి దశలోనూ ఉపాధ్యాయుడి ముద్ర ఎంతైనా ఉంటుంది. సాధారణంగా ఎవరైనా ఉద్యోగం చేస్తే కాస్త విరామం దొరికితే బాగుంటుందని భావిస్తుంటారు. ఉద్యోగరిత్యా వత్తిడికి లోనైతే […]