అంబాసిడర్ కారు అంటే భలే క్రేజ్. గతంలో మట్టి రోడ్లపై ఆ కారు వస్తుందంటే అంత వింతగా చూసేవారు. ఎక్కువ తెల్ల రంగులోనే ఉంటే ఈ కారు రాజకీయ ప్రతినిధులు, సినీ ప్రముఖులు వినియోగించేవారు. అయితే ఇప్పుడు ఆ కార్లు తయారు కాకపోవడంతో..వాటి వాడకం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు అంబాసిడర్ కారు రేటుకు సంబంధించిన ఓ ఇన్ వాయిస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.