పుస్తకాలు చదవడాన్ని పెద్దవాళ్లే ప్రయాసగా భావిస్తున్నారు. ఇక చిన్న పిల్లల సంగతి అయితే చెప్పుకోనక్కరలేదు. నిద్ర లేచింది మొదలు పడుకునేవరకు సెల్‌ఫోన్స్‌కి అతుక్కుపోతున్నారు. పాఠ్యపుస్తకాలను కూడా ఏదో మొక్కుబడిగా చదివేస్తున్నారు. ఇక కథల పుస్తకాల సంగతి సరేసరి. అటువంటిది ఐదేళ్ల చిన్నారి తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలు చదివి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇండో అమెరికన్ చిన్నారి కియరా కౌర్‌కు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. ఈ ఇష్టంతో 36 పుస్తకాలను రెండుగంటల్లోపే చదివి అతిచిన్న వయసులో […]