ఇంటర్నేషనల్ డెస్క్- ఆప్ఘనిస్థాన్ లో పరిస్థితులు అంతకంతకు దిగజారుతున్నాయి. అఫ్ఘాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరువాత అక్కడి ప్రజల పరిస్థితి భయానకంగా మారింది. ప్రధానంగా అఫ్ఘానిస్థాన్‌లో ఆకలి కేకలు మార్మోగుతున్నాయి. పిల్లల ఆకలిచావులు అఫ్గాన్ లో కలకలం రేపుతున్నాయి. ప్రజలకు ఉపాధి అవకాశాలు లేక సతమతమవుతున్నారు. దీంతో తలెత్తిన ఆహార సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. ఇరవై రోజుల క్రితం ఆఫ్గనిస్థాన్ లోని పశ్చిమ కాబూల్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది పిల్లలు ఆహారం […]