ఇవాళ సాయంత్రం అయిదు గంటలకు మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ నేపథ్యంలో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా లాక్‌డౌన్ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై కీలక ప్రకటన చేసే అవకాశముంది. మునుపటితో పోల్చితే అనేక రాష్ట్రాలు ‘అన్ లాక్’ ప్రక్రియకు తెరదీశాయి. ప్రధానంగా వ్యాక్సినేషన్ అంశంపైనా ఆయన దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ నివారణలో వ్యాక్సిన్లు ఎంత కీలకపాత్ర పోషిస్తాయన్నది వివరించే అవకాశాలున్నాయి. […]