గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కాటుకు పలువురు సినీ.. ఇతర సాంకేతిక వర్గానికి సంబంధించిన వారు కన్నుమూశారు. ఇక ప్రముఖ కన్నడ నటుడు, పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణవార్తను మర్చిపోకముందే మరో నటుడు మృతి చెందారనే వార్తతో సినిమా పరిశ్రమ ఉలిక్కి పడింది. బాలీవుడ్ నటుడు యూసుఫ్ హుస్సేన్ ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 73 ఏళ్లు. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ముంబైలోని […]