గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కాటుకు పలువురు సినీ.. ఇతర సాంకేతిక వర్గానికి సంబంధించిన వారు కన్నుమూశారు. ఇక ప్రముఖ కన్నడ నటుడు, పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణవార్తను మర్చిపోకముందే మరో నటుడు మృతి చెందారనే వార్తతో సినిమా పరిశ్రమ ఉలిక్కి పడింది.
బాలీవుడ్ నటుడు యూసుఫ్ హుస్సేన్ ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 73 ఏళ్లు. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని యూసఫ్ అల్లుడు, నిర్మాత హన్సల్ మోహతా వెల్లడించారు. యూసఫ్ హుస్సేన్ సినిమాలతో పాటుగా టెలివిజన్ కార్యక్రమాల్లో కూడా కనిపించారు. ఆయన నాకు మామ కాదు నాన్నలాంటి వాడని ఎమోషనల్ అయ్యాడు.
రాజ్‌కుమార్ రావుతో తీసిన షాహిద్ చిత్ర నిర్మాణ సమయంలో యూసుఫ్ తనకు అండగా నిలిచినట్లు పేర్కొన్నారు. దిల్ చాహ్తా హై, రాజ్, హజారోన్ ఖ్వైషీన్ ఐసీ, ఖాఖీ, వివాహ్, షాహిద్, OMG, క్రిష్ 3, విశ్వరూపం 2, దబాంగ్ 3 వంటి అనేక ఇతర చిత్రాలలో ఆయన నటించారు. యూసుఫ్ హుస్సేన్ పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళి తెలిపారు.
RIP Yusuf Husain. pic.twitter.com/laP0b1U732
— Hansal Mehta (@mehtahansal) October 29, 2021